Chittoor Police: రేపు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
కొంతమంది జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు.. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నారు.. ఆటోల ద్వారా జనాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారిపై సాక్ష్యాదారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ పేర్కొన్నారు.
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ.. ఎలా.. ఏ ప్లాన్తో డబ్బులు కొట్టేస్తారో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ భారీ మోసం చూస్తే.. అతడి కన్నింగ్ ఐడియా చూసి అంతా నోరువెల్లబెడుతున్నారు.. పెళ్లి పేరుతో ఏకంగా 28 కోట్ల రూపాయలు కొట్టేశాడో కేటుగాడు.
తీగ లాగితె డొంకంతా కదిలినట్టు.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తుంది.. విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అరెస్ట్ల సంఖ్య పెరిగిపోతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు.. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు... అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు..
దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో చేసిన నేరాలు అతడిని వెంటాడాయి. ఓ ప్రమాదంలో పెద్ద కుమారుడు చనిపోగా.. చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం కూడా వరుస సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం ఇక తన వల్ల కావడం లేదని, అపరాద భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు. Also Read:Allu Arjun : తెలుగువారంటే…
Fake Doctor: చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్టర్ కలకలం రేపుతోంది. దశాబ్ద కాలంగా డాక్టరుగా చలామణి అవుతూ వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ అనేక మందిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.