Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతున్నప్పటికీ ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. అయితే, పోలీసుల విచారణలో కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం. కాగా, బాలిక వైష్ణవి సొంత సోదరుడు బ్రహ్మయ్యను జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఇక, జమ్మలమడు డీఎస్సీ కార్యాలయంలో కజిన్ బ్రదర్ కొండయ్యను విచారిస్తున్నారు. ఇంటర్ విద్యార్థినిని వెతికేందుకు గత సోమవారం నాడు సాయంత్రం నుంచి ఉదయం వరకు కొండయ్య గండికోటలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Read Also: Mumbai Local Train Blast: 19 ఏళ్ల తరువాత 12 మంది నిర్దోషులుగా విడుదల చేసిన బాంబే హైకోర్టు
అయితే, కొండయ్య మృతురాలి కజిన్ బ్రదర్ అని సమాచారం. చెల్లెలును వెతుకుతూ సోమవారం నాడు రాత్రంతా అక్కడే ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక, మంగళవారం ఉదయం మొదట బాలిక మృతదేహాన్ని గుర్తించిన అతడే.. బాలిక కుటుంబానికి గండికోటలో సమీప బంధువులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో బాలిక హత్యలో కుటుంబ సభ్యులు పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వేరు వేరుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మైనర్ బాలిక వైష్ణవి హత్య జరిగిన రోజు గండికోటలోని సెల్ ఫోన్ సిగ్నల్ డంపును పోలీసులు సేకరించారు.