తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
Margani Bharat: బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హరికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే.. అందుకే ప్రజలకు చెబుతున్నాం.. చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.. మానసికంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని సజ్జల ప్రశ్నించారు.
పేర్నినాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం.. వినలేని విధంగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారు.
చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు..
హర్యానాలోని గురుగ్రామ్లో హత్యకు గురైన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కన్న తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు..
Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
విశాఖ నగర నడిబొడ్డున గంజాయి సాగు కలకలం సృష్టించింది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రాస వీధి సమీపంలోని ఓ పాడు బడ్డ ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశంలో కొన్ని మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే, అవి గంజాయి మొక్కలను పోలినట్టే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు..