‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Read also : మీడియాకి మంచి మెటీరియల్…