నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
సౌత్ కోల్కతా లా కాలేజీ అత్యాచారం కేసులో కోల్కతా పోలీసులు శనివారం ఓ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది నాల్గవ అరెస్టు. గతంలో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..
ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్కు…
వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.
శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది.
Drugs Case : తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా కలకలం రేగింది. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పుడు మరో నటుడు కృష్ణ కూడా అరెస్టు అయ్యాడు. కృష్ణ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంగంబాకం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లూ డ్రగ్స్ ఏమైనా…
బెంగళూరులోని సంపిగేహళ్లి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిపై దాడి చేసి "జై శ్రీరామ్" అని నినాదం చేయమని బలవంతం చేశారని బాధితుడు చెప్పాడు. ఈ సంఘటన జూన్ 22న సాయంత్రం 4:30 - 5:30 గంటల మధ్య జరిగింది. బాధితుడి పేరు జమీర్. వృత్తిరీత్యా మెకానిక్. తన స్నేహితుడు వసీమ్తో కలిసి ఓ కస్టమర్ నుంచి డబ్బు వసూలు చేయడానికి బయటకు వెళ్లినట్లు సమాచారం. చొక్కన్హళ్లి సమీపంలోని చెట్ల గుత్తికి చేరుకోగానే.. 5…