Srushti Case: హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆమెను కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 86 మంది సరోగసీ దంపతుల వివరాలను సేకరించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
Kishan Reddy : గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యం
ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన వైద్యురాలి లెటర్ హెడ్‌లను నమ్రత అక్రమంగా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యురాలి పేరుతో మందులు, ఇంజెక్షన్లు రాసి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లు ఎలా ఉపయోగించబడ్డాయో తెలుసుకుని వైద్యురాలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నమ్రతపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామాలతో నమ్రత కేసు మరింత క్లిష్టంగా మారింది. పోలీసులు కస్టడీ సాధించి పూర్తి వివరాలను వెలికితీయాలని భావిస్తున్నారు.
Samsung Galaxy F05: సామ్ సంగ్ ఫోన్ రూ. 6000 కంటే తక్కువ ధరకే.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ