Gang Rape: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలు ( 9,12 ఏళ్ల వయస్సు) ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటన ఆగస్టు 5వ తేదీన జరిగింది. బాధిత చిన్నారులు తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేయగా, వారు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గ్యాంగ్‌రేప్ జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో లైంగిక దాడుల నిరోధక చట్టం (POCSO) కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5వ తేదీన బాలికలు ఈత నేర్చుకోవడానికి ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లగా.. అనిల్ కుమార్ అనే వ్యక్తి వారిని ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు మునిల్ కుమార్ కూడా ఆ బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటపెడితే చంపేస్తామని ఇద్దరు నిందితులు ఆ బాలికలను బెదిరించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.