Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్ స్వాధీనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trainee IPS Case: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో మహిళతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
అశోక్ నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గదిలో నుంచి రెండు ప్రేమలేఖలు, ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, కేసు దర్యాప్తులో భాగంగా విశ్లేషించనున్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఈ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయిన అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళతో అతడు సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అయితే విడాకుల తర్వాత తనతో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని ఉదయ్ చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, మరో మహిళ కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై ఇద్దరూ ఒకరితో ఒకరు తమ అనుభవాలు, బాధలను పంచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడనే ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు