Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Incident: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణను పోలీస్ లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసుపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని సూచించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటనతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటనపై చర్చ సందర్భంగా డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపిన విషయాన్ని డీజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
అనంతరం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తంగా.. గాదె సాయి కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 9 బృందాలను ఈ కేసు కోసం ఏర్పాటు చేస్తున్నారు. గాదే సాయి కృష్ణ ను పోలీసులు తీసుకెళ్లి హింసించి లాకప్ డెత్ పోలీసులు చేశారని 38 రోజులుగా సాయికృష్ణ ఆచూకీ తెలియటం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా పోలీసులను కలిసి వినతిపత్రం ఇవ్వటంతో పాటు ఆందోళన కూడా నిర్వహించారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజా ఆదేశాలు ఇవ్వటంతో సాయి కృష్ణ వ్యవహారం కీలక మలుపు తీసుకున్నట్లుగా అయింది.. ఇవాళ ఉదయం కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ నాగేశ్వరరావు ఇతరులు ప్రెస్ మీట్ పెట్టి తమకు ఏ పార్టీతో సంబంధం లేదని ఎన్నికల్లో మాత్రం లోకేష్, పవన్ కోసం పనిచేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ గతంలో తమకు న్యాయం చేయాలని బాధ్యత చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు..
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!