Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
- బీహార్‌లో సంచలనంగా మారిన భరత్ తివారీ ఎన్కౌంటర్..
- ఘటనలో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat tiwari: బీహార్ రాజకీయాలను ‘‘భరత్ తివారీ ఎన్కౌంటర్’’ కుదిపేస్తోంది. భోజ్‌పూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎన్కౌంటర్లో పాల్గొన్న జగదీష్పూర్ ఎస్డిపీఓ, షాహ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై షాహ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తివారీ ఎన్‌కౌంటర్‌పై కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు పోలీసుల వాదనల్ని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి.
భరత్ తివారీ మరణించిన వారం తర్వాత కుటుంబ సభ్యులు దీనిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన న్యాయ విచారణపై తమకు నమ్మకం లేదని వారు చెబుతున్నారు. న్యాయం జరగకపోతే సామూహిత ఆత్మహత్యకు పాల్పడుతామని కుటుంబీకులు హెచ్చరిస్తున్నారు. మృతుడి సోదరుడు చందన్ తివారీ మాట్లాడుతూ.. కేవలం విచారణ మాత్రమే కాదని, దోషులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం కవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలని పాట్నా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామానికి చెందిన భరత్ తివారీ గ్రామంలోని రోడ్ల దుస్థితి, స్థానిక అవినీతిపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేవారు. అయితే, జూన్ 17 స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతడిని చుట్టుముట్టింది. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో అతడి మోకాళ్లు, తొడ భాగంలో నాలుగు బుల్లెట్లు దిగి, పాట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భరత్ తివారీ తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!