Gold Scam: పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు.
Nandyal District: ఆస్తికోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. ఆస్తి వస్తుందంటే.. కన్న తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరులో ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కర్మ కాండలు పూర్తి కాక ముందే ఆస్తి కోసం కన్న తల్లిని చంపేందుకు కొడుకు, మనవళ్ల యత్నించారు.
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం…
తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.
Father Funeral Rites: మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఇద్దరు కుమారులు దామోదర్, కిషన్ సింగ్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం ఎంతంగా ముదిరందంటే.. చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరూ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించేంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 3వ…
Kaushik Reddy: నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని…
CMR Engineering College: మేడ్చల్‌లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై…
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో మైనర్ బాలలు చోరీలకి పాల్పడుతున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలను ఎంచుకుని, వృద్ధుల పట్ల నేరపూరిత చర్యలకు దిగడం పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజా ఘటన నేపథ్యంలో వాణి నగర్ ప్రాంతంలో ఓ వృద్ధుడు కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో, అతని షర్ట్ పాకెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌ను మైనర్ బాలలు చాకచక్యంగా చోరీ చేశారు. వారు పేపర్లు, కవర్లు అడ్డుపెట్టి ఈ…