Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో మైనర్ బాలలు చోరీలకి పాల్పడుతున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలను ఎంచుకుని, వృద్ధుల పట్ల నేరపూరిత చర్యలకు దిగడం పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజా ఘటన నేపథ్యంలో వాణి నగర్ ప్రాంతంలో ఓ వృద్ధుడు కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో, అతని షర్ట్ పాకెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌ను మైనర్ బాలలు చాకచక్యంగా చోరీ చేశారు. వారు పేపర్లు, కవర్లు అడ్డుపెట్టి ఈ నేరానికి పాల్పడగా, ఆ దృశ్యాలు సమీపంలోని ఓ దుకాణం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Also Read: AI Based Laptops: AI ఆధారిత ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పి
బంగారు భవిష్యత్తు సాధించాల్సిన బాల్యం నేరానికి దారి తీస్తుండటం విచారకరం కలిగిస్తుంది.. ఈ సంఘటనలు సమాజంలో తల్లిదండ్రుల బాధ్యతా నిర్వహణపై ప్రశ్నలు పెంచుతున్నాయి. ఇలాంటి బాల నేరాలు సమాజానికి హెచ్చరికగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగం వీరి జీవితాలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడికి వెళ్లాల్సిన పిల్లలు నేరాలకు పాల్పడడం వారి భవిష్యత్తును క్రమబద్ధం చేసే విధానాలను రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇదే సమయంలో, జగిత్యాల పోలీసులు సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఇప్పటికే పలు భారీ చోరీలను కొద్ది కాలంలోనే పరిష్కరించారు. అయితే, మైనర్ బాల నేరాల విషయంలో వారు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.