వీధికుక్కల బెడద అన్నిచోట్ల వుండేది.. కానీ కొందరు వీధికుక్కలపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. 18 వీధి కుక్కలను పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన వెలుగు చూసింది. దీనిపై కలకలం రేగుతోంది. యానిమల్ యాక్టివిస్ట్ శ్రీలత ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల అనంతరం పోలీసులు కేసులు నమోదు చేశారు. చేబ్రోలు పోలీసులు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం వెలమిల్లికి చెందిన వీరబాబు చేబ్రోలులో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో అవి మృతి చెందాయి. మృతి చెందిన వీధి కుక్కలను ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళుతుండగా జంతు సంరక్షకులైన పావని, శ్రీలత అడ్డుకున్నారు. వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చి ఎందుకు చంపారని వారిని ప్రశ్నించారు. అయితే వీరబాబు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కుక్కల్ని చంపమని ఆదేశించినట్లు చెప్పాడు.
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి
దీంతో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, ఆదేశాలు జారీచేసిన పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గతంలో వీరబాబు చాలా చోట్ల వీధి కుక్కల్ని చంపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత కోరారు. దీంతో పోలీసులు వీరబాబు తో పాటు చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ కె.స్వామి కేసు నమోదు చేయడంతో పాటు స్థానిక పశువైద్యుడి చేత మృతిచెందిన శునకాలకు పోస్టు మార్టం చేయించారు. గతంలో ఓ వ్యక్తి తన మేకను కుక్క కరిచిందని, 40 వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన.. సంచలనం కలిగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోనూ 200 కుక్కలను చంపి ఓ ఆలయం ఆవరణలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది.
Read ALso: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు