ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు. మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా…
ఆంధ్రప్రదేశ్‌లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం…
ఆస్తుల కోసం పోరాటం కాదు… హక్కు కోసం పోరాడుతున్నామని.. ఆట ఇప్పుడే మొదలైందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. గర్భవతిని కాబట్టే ఇంతకాలం బయటికి రాలేదు… డాక్టర్ సలహా మేరకే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నా.. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతోపాటు శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు.. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొండి.. కానీ, తప్పుడు కేసులతో పోలీసులను…
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ…