Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Middle Income Groups Struggle With Fraud Schemes

Schemes Fraud: అమాయకుల్ని అడ్డంగా ముంచేస్తున్న స్కీం(స్కాం)లు

Published Date :December 5, 2022 , 3:28 pm
By NTV WebDesk
Schemes Fraud: అమాయకుల్ని అడ్డంగా ముంచేస్తున్న స్కీం(స్కాం)లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమాయకులే వాళ్ళ టార్గెట్. మాయమాటలే వాళ్ళ పెట్టుబడి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు అని చెప్పే తీయటి మాటలు మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ….మాయగాళ్ళ మాటలు నమ్మి లక్షలకు లక్షలు అప్పులు తీసుకొచ్చి శూన్యంలో పెట్టుబడి పెడితే తెల్లారేసరికి బోర్డు తిప్పేస్తున్నారు నకిలీ కంపెనీ ల కేటుగాళ్లు.. ప్రజల ఆశను ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. అధిక వడ్డీ పేరుతో కొందరు ఆన్లైన్ పెట్టుబడులతో మరికొందరు ప్రజల నుంచి నగదు వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు నా మధ్యతరగతి ఆశ తమ కష్టపడి సంపాదించిన డబ్బును శూన్యంలో పెట్టుబడిగా పెట్టాల్సిన మల్టీ లెవెల్ ఫైనాన్స్ మోసంగా చెప్పుకునే ఈ తరహా వ్యవహారాలు ఇప్పుడు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి.

చిలకలూరిపేట ప్రాంతంలో కట్టుబడివారిపాలెంలో గ్రామంలో ఏడాది క్రితం ఒక మాజీ ప్రజాప్రతినిధి పెద్ద ఇల్లు కట్టు కోవడం, భూములు కొనడం గ్రామస్థులు చూశారు. తమతో పాటే సాధారణంగా ఉండే అతన్ని చూసి అంత ఎలా సంపాదించాడంటూ ఊరంతా చర్చ జరిగింది. దీంతో అతను చెప్పిన మాట విన్నవారంతా ఆశ్చర్యపోయారు. కారణం రూ.లక్ష చెల్లిస్తే ప్రతి నెలా రూ.20 వేల చొప్పున 12 నెలల పాటు మొత్తం రూ.2.40 లక్షలు వచ్చాయని చెప్పాడు. ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించానని, ప్రస్తుత ప్రజాప్రతినిధితో కలసి గ్రామస్థులను నమ్మించాడు. వీరిలో ఒకరు హైదరాబాద్లో మీ పేరు మీద ఫ్లాట్లు రాసిస్తారని, మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వగానే మీ ఫ్లాట్ మీరు వెనక్కు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని నమ్మబలికారు. మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని, లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చే నెలకు ఇంకో లక్ష కలిపి రెండు లక్షలు ఇస్తామని చెప్పే తీయటి మాటలు అమాయక ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాయి.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

మరో ఘటనలో మీ పేరు మీద ఐడి క్రియేట్ చేసి బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడతామని, నేను కూడా అలా డబ్బులు పెట్టి బాగా డబ్బులు సంపాదించానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు అడిగితే ఆ యాప్ మొత్తం క్లోజ్ చేశారని, అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయనీ సంవత్సరం నుంచి తిప్పుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు ఒకచోట చిలకలూరిపేట ప్రాంతంలోనో, పలనాడు ప్రాంతంలోనూ డెల్టా ప్రాంతంలోనూ ఆగిపోవడం లేదు… రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేలు, కొన్ని లక్షల మంది ఇలా శూన్యంలో పెట్టుబడి పెట్టి ఇప్పుడు లబో దీబో అంటున్న పరిస్థితి ….పేరు ఏదైనా పెట్టే పెట్టుబడి మాత్రం అబద్దమే…. తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని వ్యాపారం ఇది. అధిక వడ్డీలకు పెట్టుబడి కావాలని కొందరు , డబ్బులు క్రిప్తో కాయిన్స్ , బైట్ కాయిన్స్ ల పేరుతో కొందరు , కాటర్ పిల్లర్ అనే యాప్ లో పెట్టుబడి పెడితే అద్భుతాలు జరుగుతాయని మరికొందరు ఇలా పేరు ఏదైనా జరిగే మోసం తీరు మాత్రం ఒకటే…..

ఈమధ్యకాలంలో క్యాటర్ పిల్లర్ యాప్ బాధితులు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నారు…. క్యాటర్ పిల్లర్ అంటే అది ఒక మాయా కంపెనీ….క్రేన్ ల ను ప్రొక్లైనర్ లను మెయింటినెన్స్ చేసే కంపెనీగా క్యాటర్ పిల్లర్ కు ఒక పేరు ఉంది ….అచ్చు అలాంటి నకిలీ కంపెనీ లోగోతో.. ప్లే స్టోర్ లో యాప్ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో పేజీలు ఓపెన్ చేయడం చేశారు మాయా కేట్ గాళ్ళు.. ఆ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే లక్షల రూపాయలకు కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు..మీరు ఒక క్రేన్ పైన లేదా ప్రోక్లైనర్ పైన 10 లక్షలు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి ఆ యంత్రానికి వచ్చే రోజు ఆదాయంలో మీకు కొంత అమౌంట్ను పంచుతారు క్యాటర్ పిల్లర్ కంపెనీ నిర్వాహకులు… రోజుకు 10,000, 12,000 ,8,000 ఇలా యంత్రాలకు ఉన్న డిమాండ్ ను బట్టి ప్రతిరోజు మీ అకౌంట్లో సొమ్ము పడుతుంది అని నమ్మ పలుకుతారు ప్రాక్టికల్ గా కూడా కొన్ని రోజులు చేసి చూపిస్తారు…. 30 రోజులు తర్వాత మీరోజు వారి లాభంతో పాటు పెట్టుబడిగా పెట్టిన అమౌంట్ కూడా మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పే మాటలు మధ్యతరగతి కుటుంబాలకు వరంలా కనిపిస్తాయి.

మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు తల్లడిల్లి పోతున్నారు…. బయటికి చెప్తే పరుగు పోతుందని అసలు మనమే తిరిగి కేసుల్లో ఇరుక్కుంటామని భయపడుతున్న మధ్యతరగతి కుటుంబాలు గుట్టు చప్పుడు కాకుండా రికమండేషన్ చేయించుకుని పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. అయితే ఇందులో కొంతవరకు బ్యాంకు నుండి బ్యాంకుకు ట్రాన్స్ఫర్లు చేసిన వారికి నగదు వస్తుందన్న ఆశ ఉంది… కానీ థర్డ్ పార్టీ ద్వారా అమౌంట్ కట్టిన వేల సంఖ్యలో ఉన్న బాధితులకు తిరిగి డబ్బు వస్తుందని ఆశ లేదు…. కానీ మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకున్న మాయ కంపెనీ ల దెబ్బకు తాము కుదేలు అయిపోయామన్న వాస్తవం మాత్రం ఇప్పుడిప్పుడే బోధపడుతుంది.

బాగా డబ్బు సంపాదించాలంటే మీరు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చని నమ్మబలికే మాయ గాళ్ళ పబ్లిసిటీ ద్వారా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణగా క్షేత్రస్థాయిలో ఉండే కొంతమంది ఏజెంట్లు తమ జీవితం అద్భుతంగా మారిపోవడానికి ఆ యాప్ కారణమని, ఆ సంస్థలో పెట్టుబడి పెట్టడమే ఈ భోగభాగ్యాలన్నిటికీ ప్రత్యక్ష ఉదాహరణ అని తీయటి కబుర్లు చెబుతున్నారు…. అసలు విషయం వీళ్ళ దగ్గర కూడా ఉండదు… ఈ మౌత్ పబ్లిసిటీ ,ఈ కథ ఈ డ్రామా నడిపేదంతా మల్టీ లెవెల్ నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి మాయ ఏజెంట్లు ….ఈ మాయా కంపెనీలకు ఏజెంట్లను నియమించుకుంటాయి ….సదరు కంపెనీలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకొని లక్షల రూపాయల జీతానికి ఆఫర్ చేస్తాయి.

మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకోవటమే ఈ ఎంప్లాయిస్ పని… వీళ్ళు చెప్పే మాటలకు ఇదంతా నిజమే అనుకున్న చాలామంది మధ్యతరగతి ప్రజలు పొలం, బంగారం ,ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టి వడ్డీలకి అందినకాడికి డబ్బులు తెచ్చుకుని సదరు మాయ ఏజెంట్లు చెప్పిన ఖాతాలో జమ చేసారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కో తరహాలో చేస్తున్న మాయ ప్రజలకు తెలుస్తున్న ఎందుకో ఇప్పటికీ అమాయకంగా గుడ్డిగా నమ్మిస్తూ తమ జీవితాలను చీకటి చేసుకుంటున్నారు ఇప్పుడు పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఏం చేయాలో పాలు పోక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు…. ఇప్పుడిప్పుడే ఈ ఇలాంటి వ్యవహారాలపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు బాధితులు గడిచిన ఏడాదికాలంగా ఈ చీకటి వ్యాపారం జరుగుతున్న ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కూడా ఏమీచేయలేని పరిస్థితి ఎక్కడో తెలియని యాప్ లలో పెట్టుబడి పెడితే వాటిని ఎలా రాబట్టాలో కూడా తెలియని పరిస్థితి పోలీసులు కూడా ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీకు జరిగే నష్టానికి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని సలహాలు ఇవ్వడం తప్ప జరుగుతున్న మోసాలను మోసగాళ్లు చేస్తున్న దురాగతాలను అడ్డుకోలేని పరిస్థితి సమాజంలో ఉంది.

(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెండ్ల సౌజన్యంతో)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agents
  • ap
  • APPs
  • Catter piller
  • chilakaluripet

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions