Cheating Bridegrooms: ఊరి ఊరికో నిత్యపెళ్ళికొడుకులు.. ఒకడు 13.. మరొకడు5
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే మూడు ముళ్ళు.. ఏడడుగులు.. అందరికీ కానీ ఆ నిత్యపెళ్ళికొడుకులకు మాత్రం కానేకాదు.. 30 ముళ్ళు, 70 అడుగులు… అంతకుమించి.. అవకాశం చిక్కినప్పుడల్లా పెళ్ళిళ్ళు చేసుకుని పక్కపక్క వీధుల్లో కాపురాలు పెట్టేస్తున్నారు. హైదరాబాద్ లో శివశంకర బాబు ఉదంతం ఇంకా ముగిసిపోక ముందే.. మరో సాఫ్ట్ వేర్ బాబు కథ తెరమీదకు వచ్చింది. పెళ్ళిళ్ళు చేసుకోవడంతో ఈ బాబులది ఒక్కో స్టైల్ . ఓ వ్యక్తి…నిత్యపెళ్లికొడుకు అవతారం ఎత్తినా…అమాయక మహిళలు మాత్రం…అబ్బే మా ఆయన బంగారం అనేవారే ..డౌట్ వచ్చి పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేస్తే…వాళ్ళ చీకటి కోణాలు బయటపడుతూ ఉంటాయి.
ఈ సతీష్ బాబు కథే వేరు…
తాజాగా గుంటూరు జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోసం బయటపడింది. దిశ పోలీసుల అదుపులో వున్నాడు ఈ మోసాల బాబు. వరుస పెళ్ళిళ్ళతో యువతులను మోసం చేస్తున్న ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కర్నాటి సతీష్ బాబు.. 13 పెళ్ళిళ్ళ శివశంకరబాబుకి వీడు కజిన్ లాంటోడు.ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు ఈ నిత్యపెళ్ళి కొడుకు సతీష్ బాబు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న దిశ పోలీసులకు ఈ బాబు బండారాలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి.
Also Read
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
కర్నాటి సతీష్ బాబు ది ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి. ఐదో పెళ్లి చేసుకున్న లక్ష్మి ఫిర్యాదుతో దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచి కుటుంబం కోసం తాను పెళ్లిళ్ళు చేసుకున్నానంటున్నాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మంచి కుటుంబం దొరకలేదని ఆ ముగ్గురికి విడాకులు ఇచ్చేశాడు సతీష్ బాబు…. నాలుగో భార్యకు విడాకులకు అప్లై చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు మంజూరు కాలేదట. నాలుగో భార్యకు విడాకులు ఇవ్వకుండా ఐదో అమ్మాయిని పెళ్లిచేసుకోవడంతో దొరికిపోయాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ బాబు. దిశ పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయంటున్నారు.
13 పెళ్ళిళ్ళ శివశంకరబాబు రూటే సపరేటు
మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ పెట్టడం, అమాయకులు లైన్లోకి రాగానే వారిని పెళ్లిచేసుకోవడం ఈ నిత్యపెళ్ళికొడుకులకు తాళితో పెట్టిన విద్య, రెండో పెళ్లయినా ఫర్వాలేదని ప్రొఫైల్ లో పెడతారు. అప్పటికే ఓ సారి జీవితంలో ఓడిపోయి..ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న అమాయక మహిళలు ..ఆ మెసేజ్ కు అట్రాక్ట్ కాకుండా ఉంటారా ? ఎవరో ఒకరు ఈ జీవితానికి తోడుంటే చాలు అనుకునే వారే ఈ ప్రబుద్దుడి టార్గెట్..అది తెలియని అమాయకులు ..ఇతగాడి ఉచ్చులో పడతారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతిపూడి గ్రామానికి చెందిన శివశంకరబాబు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు . అందరికీ చెప్పేది మాత్రం ప్రైవేటు జాబ్ చేస్తానని…బట్..శివశంకరబాబు చేసేది మాత్రం…ఎప్పుడు , ఎలా ,ఎవరిని బుట్టలో వేసుకోవాలా అని చూస్తుంటాడు. అందుకు..అమాయక మహిళలు , విడో లేడీస్ వైపే చూస్తాడు . మాట్రిమోనీలో తన ప్రొఫైల్ చూసి …కాంటాక్ట్ అయ్యారో ఇక అంతే సంగతులు..వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. జీవితాంతం తోడునీడగా వుంటానంటాడు.. చాలామందితో ఇదేమాట అంటాడు. ఒకరికి తెలీకుండా మరొకరిని.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 13మందికి తాళికట్టి కాపురాలు చేసేశాడు.
శివశంకరబాబురెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతగాడిపై నమోదైన కేసులు ఐదు . 2019 లో కేపీహెచ్‌బీ , గచ్చిబౌలీ పీయస్‌లలో కేసులు నమోదు కాగా , గత ఏడాది అనంతపూర్ టౌన్ పీయస్‌లో కేసు నమోదు అయింది .ఇక ఈ ఏడాదిలో బాలానగర్ ,రామచంద్రాపురం పీయస్‌లతో పాటు గచ్చిబౌలీ పీయస్‌లో మరో కొత్త కేసు నమోదు అయింది. తనను ఆర్యసమాజ్‌లో పెల్లి చేసుకుని…రోజూ నైట్‌డ్యూటీ అని వెళ్లేవడంటూ కొండాపూర్‌కు చెందిన బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెనుంచి .32 లక్షల నగదుతో పాటు బంగారం కూడా తీసేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో వైజాగ్‌లో ఉన్న ఇతగాడిని అరెస్టు చేసిన పోలీసులు…రిమాండ్‌కు తరలించారు .అతనిపై కేసు పెట్టేందుకు ముందుకు రాని బాధితురాళ్లు ఇంకెందరో.. ఫిర్యాదుచేసిన మహిళ ఝాన్సీ అతని స్వంతూళ్ళో నిరసన తెలుపుతోంది. ఇలాంటి నిత్యపెళ్ళికొడుకులు మన మధ్యే చాలామంది వున్నారు. పెళ్ళి చేసుకుని మోసపోయి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించేవరకూ ఇలాంటి కథలు బయటపడవు.వీళ్ళు అమాయక ముఖాల్లో కనిపించే అ’మ్మాయ’కులు.
Ganja Gang: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గాంజా గ్యాంగ్.. కత్తులతో దాడి
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!