మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో విద్యుత్ అధికారుల పై మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు వీరంగం చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో షెడ్ల నిర్మాణానికి మున్సిపల్ ఆధ్వర్యంలో భూమి పూజ చేస్తున్న క్రమంలో తమకు సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించిన విద్యుత్ అధికారుల పై వార్డు కౌన్సిలర్ లు రెవెళ్లి మహేష్,వేల్పుల సుధాకర్, జగన్నాథుల శ్రీనివాస్, పెండ్యాల లక్ష్మణ్ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడిచేశారని విద్యుత్ అధికారులు తెలిపారు. తమ ఉద్యోగులు పాషా, సృజన్ పై…
వారిద్దరు అక్కాచెల్లెళ్లు .. అక్క అంటే చెల్లికి ఎంతో ఇష్టం.. అక్క డెలివరీ సమయంలో అక్క పక్కనే ఉండాలనుకొంది చెల్లి.. అదే ఆమె చేసిన తప్పని ఆ తరువాత అర్ధమయ్యింది. అక్క ఇంటికి వెళ్లిన ఆమెపై అక్క మరిది కన్నుపడింది.. ఎప్పుడెప్పుడు ఆమెను అఘాయిత్యం చేద్దామా అని రగిలిపోయాడు. వదినకు నొప్పులు రావడంతో అందరు డెలివరీకోసం హాస్పిటల్ కి వెళ్లగా ఆ కామాంధుడు రెచ్చిపోయాడు.. బాలికను బలవంతంగా అనుభవించి , ఎవరకైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అందుకు…
ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు…
వీఐపీలను నిలువునా ముంచేసిన శిల్ప చౌదరి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. శిల్ప ఆమె భర్త శ్రీనివాస్ పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నటుడు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, రోహిణి రెడ్డి. 2 కోట్ల 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులు శిల్ప, శ్రీనివాస్ లు ఇద్దరిపై కోర్ట్ లో పీటీ వారెంట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు.…
మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాక్కున్నా, తలగడ అడ్డం పెట్టుకున్నా, కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిదారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్స్టేషన్పరిధిలో చోటు…
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయింది. ఇప్పటికే తన నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ భామ తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదు. అప్పుడు వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని 2014లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటూ కామెంట్లు చేయడంతో దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చేలరేగింది.తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కు ఇచ్చివేయాలనే…
హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 3 అంతస్థులలో సిలిండర్ పేలుడు ధాటికి గదులు కూలిపోయాయి. ఉదయం సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక కనెక్షన్ లీకేజ్ తోనే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం వుంటున్నారు. భవనంలో ఎక్కువగా యూపీ బీహార్ కు…
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు. శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్.…
ప్రముఖ డాన్సర్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నాచౌదరి అరెస్ట్ కానున్నట్లు సమాచారం అందుతుంది. 2018 అక్టోబర్ 14 2018న లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్ లో డాన్సర్ సప్నా చౌదరిపై కేసు నమోదైన విషయమ తెల్సిందే. లక్నోలోని స్మృతి ఉప్వాన్ లక్నోలో షో లో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది.. ప్రేక్షకులందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే దీనిపై టికెట్ కొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
టాలీవుడ్ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. తనను కొందరు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని తెలిపిన వారు ఇప్పుడు మోసం చేశారని…