వదిన చెల్లిపై కన్నేసిన మరిది.. డెలివరీ అని కూడా చూడకుండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరు అక్కాచెల్లెళ్లు .. అక్క అంటే చెల్లికి ఎంతో ఇష్టం.. అక్క డెలివరీ సమయంలో అక్క పక్కనే ఉండాలనుకొంది చెల్లి.. అదే ఆమె చేసిన తప్పని ఆ తరువాత అర్ధమయ్యింది. అక్క ఇంటికి వెళ్లిన ఆమెపై అక్క మరిది కన్నుపడింది.. ఎప్పుడెప్పుడు ఆమెను అఘాయిత్యం చేద్దామా అని రగిలిపోయాడు. వదినకు నొప్పులు రావడంతో అందరు డెలివరీకోసం హాస్పిటల్ కి వెళ్లగా ఆ కామాంధుడు రెచ్చిపోయాడు.. బాలికను బలవంతంగా అనుభవించి , ఎవరకైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అందుకు బాలిక భయపడలేదు.. దీంతో మరో పన్నాగం పన్నాడు.. బాలికను పెళ్లి చేసుకొంటానని నమ్మించి పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు.. అనంతరం బాలికతో పెళ్లి లేదు, గిళ్లి లేదు అంటూ ప్లేట్ మార్చాడు . దీంతో చేసేదేం లేక బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భోపాల్,జంపాల్‌పుర గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం వివాహమైంది. గతేడాది అతని భార్య గర్భవతి అయ్యింది. భార్యకు నెలలు నిండడంతో పనులు చేసి పెట్టడానికి భార్య చెల్లి(16) ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఆ ఇంట్లోనే ఉంటున్న వ్యక్తి తమ్ముడు సల్మాన్ బాలికపై కన్నేశాడు. అక్టోబర్ 13 న వదినను డెలివెరీకి తీసుకెళ్ళగా ఆమె చెల్లిని హాస్పిటల్ కి వెళ్లనివ్వకుండా చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయినా బాలిక భయపడకుండా ఇంట్లో వారికీ చెప్తానని చెప్పడంతో నువ్వంటే ఇష్టం.. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పాడు.. ఇక పెళ్లి అనేసరికి బాలిక కూడా ఓకే చెప్పింది.. పెళ్లి పేరు చెప్తూ ఆమెపై పలుమార్లు అత్యచారం చేశాడు. ఇక ఇటీవల బాలిక పెళ్లి గురించి మాట్లాడితే.. తనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?