బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే.. మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబోయే దంపతులకు షాక్ ఇచ్చారు పలువురు స్థానికులు. కత్రినా- విక్కీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లో ప్రఖ్యాతి గాంచిన చౌత్ మాత మందిర్ ని వీరి పెళ్లి కోసం మూసివేశారంట ఈవెంట్ నిర్వాహకులు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే ఆ మందిరం గత వరం రోజులుగా మూసివేయడంతో భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
క్యాట్- విక్కీల పెళ్లి వేదిక వద్దకు వెళ్లాలంటే మందిర్ వైపునుంచి వెళ్లాల్సి వస్తోంది. అందుకని ఆ మందిర్ ని మూసివేశారట ఈవెంట్ నిర్వాహకులు.. దీంతో అక్కడి స్థానికులు వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట.. తమను మాత మందిర్ కి వెళ్లకుండా మార్గమధ్యంలో వారు అడ్డుకున్నారని, మందిర్ ని మూసివేయడానికి వారెవ్వరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒక పెళ్లి కోసం అమ్మవారి గుడిని మూసివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే.. విక్కీ- క్యాట్ ల పెళ్లి చాలా భద్రతా నియమాల మధ్య జరుగుతుండడంతో ఈ విధంగా చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారంట… మరి ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.
#SawaiMadhopur: चौथ माता मंदिर को जाने वाले रास्ते को बंद करने को लेकर शिकायत
— ZEE Rajasthan (@zeerajasthan_) December 6, 2021
अभिनेत्री कैटरीना कैफ,अभिनेता विक्की कौशल,होटल प्रबंधक व जिला कलेक्टर के खिलाफ की गई शिकायत,जिला विधिक सेवा प्राधिकरण में की गई शिकायत