గురు, శుక్రవారాల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheshwarao) చెప్పారు. గోదావరి వరదలో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను భువనేశ్వరి పూర్తి చేశారు. పండ్లు, ఫలాలు, తినుబండారాలు, మంచినీళ్లు సిద్ధం చేశాం. బాధితులను టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంటుంది. సీఎం చేతకానితనం, అసమర్థతతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయని దేవినేని ఉమా విమర్శించారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పోలవరాన్ని జగన్ ప్రభుత్వం వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేసింది.తెలుగుజాతికి ద్రోహం చేసింది.దీనిపై 48గంటల్లో వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకున్నట్లే అన్నారు ఉమా. దీనిపై ముఖ్యమంత్రి జాతి ప్రజలకు సమాధానం, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న బాధితుల వద్దకు ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ వెళ్లకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా స్పందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దేవినేని ఉమా. సీఎం వాస్తవాలను పరిశీలించాలని, గాల్లో తిరిగితే వరద బాధితుల కష్టాల తీరతాయా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి జగన్ కి వాళ్ళు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వరద వచ్చే విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలం చెందారన్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీరుపై దేవినేని ఉమా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు వరద వస్తుందని తెలియదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మహారాష్ట్రలో వరదలు వస్తున్నప్పుడు.. ఆ నీరు ఎగువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని తెలుసుకోలేరా అని ఆయన ప్రశ్నించారు.
Bomb Explosion: పశ్చిమ బెంగాల్‌లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం