CPI Ramakrishna: పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే..
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
- సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం
- పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యతన్న రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి.. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి రూ.33 వేలకోట్ల నిధుల విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..
Read Also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం విదితమే.. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన విషయం విదితమే. అంతేకాదు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్న సీఎం.. ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఫైర్ అయ్యారు.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను అను గుర్తుచేసుకున్నారు.. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!