ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పోలవరం నిర్మాణం పై సమీక్షలు నిర్వహించనున్నారు.. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్ధలతో భేటీ కానున్నారు..
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే క్లారిటీ వచ్చింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం…
Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో జాప్యం కొనసాగుతూనే ఉంది.. అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల ఇచ్చిన రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం…
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. తెలుగు దేశం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్… పోలవరం నిర్మాణం పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే…
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు జీవం పోసింది వైఎస్ఆర్ అని.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దేనని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…పోలవరం కు 55 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తోంది.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. పూర్తి చేసిన పనులను పరిశీలించి.. ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను నుంచి సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇక, మరోసారి పోలరవం ప్రాజెక్టు డ్యామ్ సైట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్.. ఈ నెల14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు…
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగినమేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకమవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం ఒకటైతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులిపేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాసపనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా…