Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. తెలుగు దేశం పార్టీ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన బిశ్వేశ్వర్ తుడు.. ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
Read Also: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నించిన జీవీఎల్.. కేంద్రం సమాధానం ఇదే..
కాగా, గతంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న గడువులోగా పోలవడం పూర్తికవాడం కష్టమేనని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే.. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టకు సంబంధించి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు.. డిసెంబర్‌లో సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు.. ప్రస్తుతం అంచనా వేసిన టైమ్‌లైన్‌ల ప్రకారం.. పోలవరం ప్రాజెక్ట్‌ను 2024 మార్చి నాటికి, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని.. కానీ, గోదావరిలో పెద్ద వరదల కారణంగా ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొన్న విషయం విదితమే. అయితే, పోలవరం నిర్మాణం విషయంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్శం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.. పోలవరం ఆలస్యానికి మీరంటే.. మీరే కారణమంటూ దుమ్మిత్తిపోసుకుంటున్నారు నేతలు.