Supreme Court: అక్టోబర్ నెలలో లైంగిక నేరాలపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో)కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశానలు అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుమోటోగా తీసుకున్న సుప్రీం విచారణ జరిపింది.
Delhi High Court: మైనర్‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని, అతనిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని హైకోర్టు పేర్కొంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ప్రస్తావించారు.
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సు వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించవద్దని లా కమిషన్ కేంద్రానికి సూచించింది.
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకింది.
Two Finger Test: ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుల మగతనాన్ని పరీక్షించేందుకు కొత్త సైంటిఫిక్ టెక్నిక్స్‌ని ఉపయోగించాలని, వీలైనన్ని త్వరగా ఈ SOP సిద్ధం చేయాలని, తద్వారా వీర్యం పరీక్ష ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు చెబుతోంది.
The age of consent: మధ్యప్రదేశ్ హైకోర్టు మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల సెక్స్ సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చాలా క్రిమినల్ కేసుల్లో యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జ్ ధర్మాసన వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 2018లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.