Mumbai: తల్లి అనే పదానికి మాయని మచ్చని తీసుకువచ్చింది ఓ మహిళ. తన ముందే, తన బిడ్డపై అత్యాచారం చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది. తన రెండున్నరేళ్ల కూతురు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో జరిగింది. నిందితుడు, సదరు మహిళ ప్రియుడిగా తేలింది. ఈ కేసులో ముంబై పోలీసులు రీనా షేక్ అనే మహిళతో పాటు, ఆమె లవర్ ఫర్హాన్ షేక్‌ని అరెస్ట్ చేశారు.
Madras High Court: పోక్సో చట్టం కింద నిందితుడు మైనర్ బాలికతో లైంగిక నేరానికి పాల్పడితే ‘‘వివాహం’’ ఎలాంటి రక్షణ ఇవ్వదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 22 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసును విచారించిన కోర్టు, అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టులో విచారణ సమయంలోనే బాలిక అతడికి భార్యగా మారింది.
Calcutta High Court: బాధితురాలి వక్షోజాలను పట్టుకునే ప్రయత్నం ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ కిందకు వస్తుందని, ‘‘అత్యాచారం’’, ‘‘అత్యాచారం ప్రయత్నం’’ కాదని పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టం కింద నిందితుడిని దోషిగా శిక్ష విధించిన ట్రయర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు శుక్రవారం సస్పెండ్ చేస్తూ, ఈ తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు తన విచారణలో నిందితుడు ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ మరియు ‘‘అత్యాచార ప్రయత్నం’’ రెండింటిలోనూ దోషిగా నిర్ధారించారు. అతడికి…
POCSO : నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్‌భవన్ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది. వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్‌ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం…
Thane: క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని బీహార్ నుంచి అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బీహార్‌లో బాలిక కుటుంబం ఉన్న అదే గ్రామానికి చెందిన నిందితుడు రెండు నెలల క్రితం బద్లాపూర్‌లో వారి కోసం ఒక అద్దె వసతిని ఏర్పాటు చేశాడు. బాలిక చికిత్సకు సాయం చేశాడు.
POCSO Case: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని బాలికపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు…
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
Atrocious On Minor: రాజస్థాన్ లోని జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు కునాల్ (22). ఆగస్టు 25న బాలికను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ…
Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది.