MadhyaPradesh: మైనర్‌పై సామూహిక అత్యాచారం.. తప్పించుకునే క్రమంలో బ్రిడ్జిపై నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకింది. ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర శుక్లా మాట్లాడుతూ – ఈ సంఘటన జూలై 15 రాత్రి జరిగింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారం చేసి చంపుతామని బెదిరించారు. వీరిద్దరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఇద్దరు యువకులు తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇద్దరూ పక్క ఊరి నివాసితులని, ఆమె ముఖానికి గుడ్డ కప్పి మోటార్‌సైకిల్‌పై కూర్చోబెట్టి తమ గ్రామానికి తీసుకెళ్లారని, ఇద్దరూ కలిసి కచ్చా ఇంట్లో అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత ఓ బాలుడు ఆమెను ఖాండ్వాకు తీసుకెళ్లాడు. ఇంతలో, బాధితురాలు తన కుటుంబ సభ్యులకు పదేపదే మిస్డ్ కాల్స్ చేసింది. ఆ తర్వాత బంధువులు ఆమెను వెతుకుతూ ఓవర్ బ్రిడ్జికి చేరుకున్నారు. వారిని చూసి ఆ యువతి వంతెనపై నుంచి కిందకు దూకింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
Read Also:EMRS Recruitment: నిరుద్యోగులకు శుభవార్త..4,602 పోస్టులకు ఉద్యోగాలు..జీతం ఎంతంటే?
ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకడంతో బాలికకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో పరీక్షల తర్వాత దవడ విరిగినట్లు తేలింది. బాధిత బాలిక విషాదఛాయలు విని కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే నర్మదానగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. పోలీసుల ఎదుట బాలిక వాంగ్మూలం నమోదు చేయగా.. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇద్దరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!