Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అక్టోబర్ నెలలో లైంగిక నేరాలపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో)కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశానలు అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుమోటోగా తీసుకున్న సుప్రీం విచారణ జరిపింది.
‘‘యుక్త వయసులో బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం లొంగకూడదు’’ అని పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరాదని, న్యాయమూర్తులు బోధించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని చెప్పింది. ‘‘ఈ ఉత్తర్వులు యుక్త వయస్కుల హక్కుల్ని పూర్తిగా ఉల్లంఘించడమే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభయ్ ఓకా, పంకజ్ మిథాల్ విచారించారు.
Also Read
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారం చేశాడని, అయితే వీరిద్దరు మధ్య రొమాంటిక్ ఎఫైర్ ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు లైంగిక కోరికలను అదుపు చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాష్, పార్థ సారథి సేన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.
Read Also: Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టులో దాఖలైన ఒరిజినల్ అప్పీల్‌ని పొందాల్సిందిగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరింది. పోక్సో నిందితులకు నోటీసులు జారీ చేసింది. మైనర్ ఫిర్యాదుదారుతో పాటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీం నోటీసులు జారీ చేసింది. జనవరి 4న ఈ కేసును మరోసారి సుప్రీం విచారించనుంది.
అంతకుముందు కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో యుక్తవయసులో లైంగిక సంబంధాల ఫలితంగా చట్టపరమైన చిక్కులను నివారించేందుకు విస్తృతమైన లైంగిక విద్యను కోరింది. కౌమారదశలో అబ్బాయిలు, అమ్మాయిలు అనుసరించాల్సిన కొన్ని విధులను సూచించింది. కౌమార దశలో స్త్రీలు తమ శరీర సమగ్రతను కాపాడుకోవడం, గౌరవం, విలువలను కాపడుకోవడం కర్తవ్యం/బాధ్యతగా హైకోర్టు పేర్కొంది. రెండు నిమిషాల పాటు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడానికి లొంగిపోతే సమాజం వారిని చులకనగా చూస్తుందని చెప్పింది. అబ్బాయిలు స్త్రీలను గౌరవించేలా తల్లిదండ్రులు చెప్పాలని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!