Cadbury Controversy: మోడీ తండ్రిని అవమానించారు.. క్యాడ్బరీని బ్యాన్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netigens Demanding Boycott Cadbury Chocolate: కావాలనే చేస్తారో లేక అనుకోకుండా అలా కుదిరిపోతుందో తెలీదు కానీ.. ఆయా సంస్థలు తీసే కొన్ని యాడ్స్ మాత్రం సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటాయి. ఇప్పుడు క్యాడ్బరీ తీసిన ఒక కొత్త యాడ్ కూడా, ఆ సంస్థని ఊహించని వివాదంలో నెట్టేసింది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. క్యాడ్బరీనే బ్యాన్ చేయాలని నెటిజన్లు పట్టుబడుతున్నారు. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది? దీపావళి సందర్భంగా విడుదలైన ఆ యాడ్‌ని పరిశీలిస్తే.. ఓ వృద్ధుడు తోపుడు బండిపై ప్రమిదెలను అమ్ముతుంటాడు. అతని పేరు దామోదర్. ఆ వృద్ధుడిని వెతుక్కుంటూ.. సూట్ ధరించిన వ్యక్తి వస్తాడు. గిఫ్టుగా క్యాడ్బరీ చాక్లెట్ ప్యాక్‌ను అందజేస్తాడు. అంతే.. క్యాడ్బరీ చాక్లెట్‌లతో సంతోషాలు పంచమని ఒక మంచి సందేశం ఇచ్చారే తప్ప, అంతకుమించి ఇంకేం లేదు.
కానీ.. ఆ వృద్ధుడి పేరు ‘దామోదర్’ అని పెట్టడమే వివాదానికి కారణమైంది. అది ప్రధాని మోడీ తండ్రి పేరు. మోడీ తండ్రిని తక్కువ చేసి.. ఈ యాడ్‌లో చూపించారని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సీరియస్‌గా స్పందించారు. ఈ వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘టీవీ చానల్స్‌లో వచ్చే క్యాడ్బరీ చాక్లెట్స్ ప్రకటనల్ని మీరు ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? ఈ యాడ్స్‌లో తనకంటూ సొంత షాపు లేని ల్యాంప్ సెల్లర్ పేరుని దామోదర్‌గా పెట్టారు. అది ప్రధాని మోడీ తండ్రి పేరు. మోడీ తండ్రిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఈ యాడ్స్‌లో చేశారు. చాయ్ అమ్ముకునే తండ్రి దీపాలను అమ్ముకునే వాడిలాగా ఇందులో చూపించారు. ఇలా చూపించినందుకు క్యాడ్బరీ సంస్థ సిగ్గుపడాలి’’ అంటూ #BoycottCadbury హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. దీంతో.. బాయ్‌కాట్ క్యాడ్బరీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
క్యాడ్బరీ సంస్థ ఇలా వివాదాల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు చాక్లెట్ల తయారీలో గొడ్డు మాంసం వినియోగిస్తున్నారంటూ 2021లో ఇది ఆరోపణలు ఎదుర్కొన్నది. అప్పుడు క్యాడ్బరీ.. తాము భారత్‌లో తయారు చేస్తున్న చాక్లెట్లు నూరు శాతం శాకాహార ఉత్పత్తులేనని వివరణ ఇచ్చింది. తమ ఉత్పత్తుల ఇంగ్రేడియెంట్స్‌లో జిలెటిన్ ఉంటే, అది హలాల్ ధ్రువీకరణ పొందిందని.. దీన్ని గొడ్డు మాంసం నుంచి తయారు చేశామని ఆ సంస్థ ప్రకటించింది. అంటే.. పరోక్షంగా అయినా ఆ గొడ్డు మాంసం ఆనవాళ్లు ఉన్నాయన్నది ఆ ప్రకటనని బట్టి అర్థం చేసుకోవచ్చు.
Have you carefully observed Cadbury chocolate's advertisement on TV channels?
The shopless poor lamp seller is Damodar.This is done to show someone with PM Narendra Modi's father's name in poor light. Chaiwale ka baap diyewala.
Shame on cadbury Company #BoycottCadbury pic.twitter.com/QvzbmOMcX2
— Sadhvi Prachi (@Sadhvi_prachi) October 30, 2022
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..