PM Narendra Modi Launches TATA-Airbus Plane Project In Gujarat: గుజరాత్ వడోదరలో టాటా-ఎయిర్ బస్ విమాన ప్రాజెక్టుకు ఆదివారం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 22,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టును భారతదేశాని పెద్ద అడుగుగా ప్రధాని అభివర్ణించారు. భారత వైమానిక దళం కోసం సీ-295 రవాణా విమానాలను టాటా-ఎయిర్ బస్ తయారు చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు.
రాబోయే సంవత్సరాల్లో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారత్ ‘ఆత్మనిర్భర్’గా మారుతుందని అన్నారు. ఈ రెండు రంగాలు భారత ఆర్మనిర్భర్ కు మూల స్తంబాలు అని ప్రధాని అన్నారు. 2025 నాటికి మన రక్షణ తయారీ స్థాయి 25 బిలియన్ డాలర్లను దాటుతుందని.. ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ కారిడార్లు దీనికి సహకరిస్తాయని మోదీ అన్నారు. భారత్ రక్షణ, ఎరోస్పేస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారని.. తమ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఆర్థిక సంస్కరణలు చేపడుతోందని ప్రధాని అన్నారు. ఈ సంస్కరణలు ఉత్పాదక రంగానికి చాలా మేలు చేస్తాయని అన్నారు.
Read Also: Naga Chaitanya: సామ్ అనారోగ్యం.. చైతన్య స్పందిస్తాడా..?
అత్యంత వేగంగా అభివృద్ధి చెంతున్న విమానయాన రంగం ప్రస్తుతం భారత్ లోనే ఉందని.. ఎయిర్ ట్రాఫిక్ పరంగా ప్రపంచవ్యాప్తంగా మనం మొదటి మూడు దేశాల్లో ఉండబోతున్నామని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి, యుద్ధం పరిస్థితులు, సప్లై చైన్ అవాంతరాలు ఉన్నప్పటికీ.. తయారీ రంగంలో భారత్ వృద్ధిలో ఉందని అన్నారు. వడోదరలో నిర్మిస్తున్న రవాణా విమానాలు మన సైన్యానికి కొత్త శక్తిని ఇస్తాయని ప్రధాని అన్నారు. ‘‘ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది గ్లోబ్’’ అనే మంత్రాన్ని భారత్ అనుసరిస్తోందని ఆయన అన్నారు.
భారత వైమానికి దళం కోసం 40 సీ-295 రవాణా విమానాలను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద 13,400 విడిభాగాలు, 4,600 సబ్ అసెంబ్లీలు , మొత్తం ఏడు ప్రధాన భాగాల అసెంబ్లీల తయారీని భారతదేశంలో చేయనున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజన్లు, ల్యాండింగ్ గేర్లు, ఏవియానిక్స్ వంటి వివిధ వ్యవస్థలు తయారు చేయనున్నారు. 71 మంది సైనికులను, 50 మంది పారాట్రూనర్లను, ఇతర సరకు రవాణా కార్యకలాపాల కోసం సీ-195 విమానాలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3000 మందికి పరోక్ష ఉద్యోగాలతో పాటు మరో 3 వేల మందికి ఉపాధిని కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 240 మంది ఇంజనీర్లు స్పెయిన్ శిక్షణ పొందుతున్నారు.