Union Minister Kishan Reddy criticizes CM KCR and KTR: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. కేసీఆర్ కన్నా దిగజారి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం, తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరూ బయటకు రాని సమయంలో…
Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్…
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచకి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. 27 సమావేశాలు, 66 రోజుల పాటు జరుగుతాయిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోెషి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ , ఇతర అంశాలపై…
MP Saumitra Khan: పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ గురువారం ప్రధాని మోదీని, స్వామి వివేకనందతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడని వ్యాఖ్యలు చేశాడు. స్వామీజీ ప్రధాని మోదీగా పునర్జన్మ తీసుకున్నారని.. మాకు స్వామీజి దేవుడితో సమానం అని ఆయన అన్నారుర. ప్రధాని తన తల్లి చనిపోయినప్పుడు కూడా దేశం కోసం తన జీవితాన్ని…
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన…
PM Security Breach: ప్రధాని నరేంద్రమోదీ భద్రతలో మరోసారి వైఫల్యం ఎదురైంది. భద్రతా వలయాన్ని ఉల్లంఘించి ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరదాకా వెళ్లాడు. కర్నాటకలో హుబ్బలిలో మోదీ రోడ్ షో చేస్తున్న సమయంలో ఈ ఘటన గురువారం ఎదురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డగించి లాగిపడేశారు.