Nirmala Sitharaman: నాదీ మధ్యతరగతే.. వారి సమస్యలేంటో తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman Shares Her Plans On Middle Class Taxes In Union Budget: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని.. ఆ వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకుంటానని అన్నారు. ‘‘నేను మధ్యతరగతికి చెందినదాన్నే. ఆ వర్గానికి చెందినవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో నేను అర్థం చేసుకోగలను. మోడీ ప్రభుత్వం ఏ బడ్జెట్‌లోనూ మధ్యతరగతి వారిపై కొత్త పన్ను విధించలేదు. రూ.5 లక్షల జీతం ఆర్జించే వారిపై ఎలాంటి పన్నులు లేవు’’ అంటూ ‘బాత్ భారత్ కీ’లో భాగంగా ‘పాంచజన్య’తో ఇంటరాక్షన్‌లో చెప్పారు. కేంద్రం 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలను విడుదల చేసిందని.. వ్యాపారం, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్ళే ప్రజలకు ఇది సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కార్యక్రమాలు జీవన ప్రమాణాన్ని మెరుగుపరచలేదా?’’ అంటూ ప్రశ్నించారు. అవును, నేనేమీ మధ్యతరగతి వారి జేబుల్లోకి నేరుగా డబ్బును వేయలేదు కానీ, ఈ సౌకర్యాలు వారికి సహాయం అందిస్తున్నాయని అన్నారు.
Phone Power Shock: ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్.. మరో ఇద్దరికీ..
Also Read
- TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇదే సమయంలో.. రాజకీయ పార్టీల ఉచితాల విషయాలపై, తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వాగ్దానం చేయదలిచిన ఉచితాలకు తమ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని నిర్మలా కోరారు. ఉచితాలేమిటన్నది ప్రశ్న కాదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చగలరా అన్నదే ప్రశ్న అని పేర్కొన్నారు. అలాగే.. బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల నుండి భారతదేశం ఎలా బయటపడిందనే దాని గురించి ఆమె మాట్లాడుతూ.. 2014 నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మార్పులకు గురైందని, ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించారు. ‘‘2013లో మన దేశం ప్రపంచంలోని ‘బలహీనమైన ఐదు’ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. కానీ.. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మార్పులకు గురైంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’’ ఆమె చెప్పింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూపొందించడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10 నుండి ప్రారంభమైంది.
VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!