Varanasi Tent City: వారణాసిలో టెంట్ సిటీ.. ప్రారంభించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi Started Tent City In Varanasi: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. గంగా నది ఒడ్డున ఎంతో అందంగా నిర్మించిన ఈ సిటీని ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ప్రారంభించారు. గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో ఈ టెంట్ సిటీని నిర్మించారు. వారణాసి నుంచి రామ్ నగర్ వెళ్లే మార్గంలో ఇది కనిపిస్తుంది. ఇందులో ఒకే విడతలో 200 మంది ఉండగలిగే కెపాసిటీ ఉంది. ఈ టెంట్ సిటీలో గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలున్నాయి. వీటిల్లో చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ తదితర వసతులన్నీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్‌తో ఇంటీరియర్ డిజైన్ చేయడం విశేషం. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే.. రూ.12,000-14,000 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ టెంట్ సిటీ భక్తులకు అందుబాటులోకి వస్తుంది.
Woman Harassment Case: భారత మహిళపై లైంగిక వేధింపులు.. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే?
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
అంతర్గత జలమార్గాలను మరింత అధునాతనం చేసి.. నదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఈ టెంట్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ టెంట్ సిటీలో బస చేయాలనుకునేవారు.. ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (UPSTDC) ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాటేజీల్లో సౌకర్యవంతమైన బస కోసం వాటర్‌ప్రూఫ్ టెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డీలక్స్ టెంట్ లోపల 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. భారీగా తరలివచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి సమస్య లేకుండా ఉండేందుకు ఈ టెంట్ సిటీకి ఏర్పాటు చేశారు. ఈ టెంట్ సిటీకి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. కాశీలో పర్యాటకానికి ఈ టెంట్ సిటీ పెద్ద ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Post Office Super RD Plan: ప్రతి నెల రూ.5వేల పెట్టుబడికి.. రూ.2లక్షల వడ్డీ వస్తుంది
A glimpse of the beautiful tent city in Benaras, inaugurated by Prime Minister Modi. It will give a major boost to tourism in Kashi, which is frequented by travellers across the world, to experience its rich cultural heritage steeped in spirituality… pic.twitter.com/SHwckyxczC
— Amit Malviya (@amitmalviya) January 13, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..