Chhattisgarh Election 2023: ఛత్తీస్‌గఢ్‌ను దోచుకుని ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Election 2023: నవంబర్ 17న చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు. నవంబర్ 7న జరిగిన తొలి దశలో జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్ అబద్ధాల బెలూన్ పగిలిపోయిందని, ఈరోజు ఛత్తీస్‌గఢ్ మొత్తం ఒక్క స్వరంతో-బీజేపీ ఈజ్ బ్యాక్ అని చెబుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ సృష్టించిందని, ఈ రాష్ట్రాన్ని బీజేపీ మాత్రమే మెరుగుపరుస్తుందని, ఇది కేవలం నినాదం కాదని.. ఇది మా విధేయత, మీతో మాకు ఉన్న పవిత్ర బంధమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read: West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
భూపేష్ బఘేల్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పని చేసిందన్న ప్రధాని.. ప్రజల సంక్షేమం నిలిచిపోయిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకుని ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్‌కు ఒకే ఒక లక్ష్యం అని, ఛత్తీస్‌గఢ్‌ను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఓడిపోతుందో, ఛత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేసే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ రాష్ట్రానికి అందాల్సిన ఎత్తులను చేరుకుంటామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానించేందుకు వచ్చానని ప్రధాని మోడీ అన్నారు. ఓట్ల లెక్కింపు తేదీని గుర్తు చేస్తూ.. ‘డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మీ అందరినీ ఆహ్వానించేందుకు వచ్చాను.. ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.” అని ప్రధాని మోడీ తెలిపారు.
Also Read: Ashok Gehlot: రాజస్థాన్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా కన్హయ్య లాల్ హత్య.. ఎదురుదాడికి దిగన గెహ్లాట్
మహాదేవ్ యాప్ బెట్టింగ్ వ్యవహారంపై ప్రధాని మోడీ బఘెల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహాదేవ్ యాప్ బెట్టింగ్ సమస్యపై బఘేల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ.. “ఈరోజు మీరు ఫోన్‌లో 508 అని టైప్ చేసిన వెంటనే మీ మొబైల్ మాట్లాడుతుంది. ఈ 508 సమస్య గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఛత్తీస్‌గఢ్ మహతారీ గౌరవాన్ని మసకబారించే ధైర్యం కాంగ్రెస్‌కు ఉంది. కావున, నవంబర్ 17న వీలైనంత ఎక్కువగా ఓటు వేసి, కమలం బటన్‌ను నొక్కి కాంగ్రెస్‌ను కడిగిపారేయాల్సిన బాధ్యత ప్రతి ఛత్తీస్‌గఢ్ వాసులపై ఉంది.” అని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..