ప్రధాని నరేంద్రమోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.
‘ఆర్టికల్ 370’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని కొనియాడుతూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ రద్దుపై 2019, ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. సుప్రీం తీర్పు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఐక్యతను చాటి చెప్పిందన్నారు. Also Read: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా…
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు.
PM Narendra Modi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. అయితే, ఢిల్లీలో పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేకపోయారు.
డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లనున్న సందర్భంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది.
గత పదేళ్లలో తాను చేసిన కృషి వల్ల ప్రజలకు తన ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చెప్పారు. ఎందుకంటే ఓటు బ్యాంకు పరిగణనలు వారి అభివృద్ధి కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తూ పౌరుల "మై బాప్" లాగా వ్యవహరించినందుకు గత పాలనలను తప్పుపట్టారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఇక ప్రచారానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు మరింత దూకుడు పెంచుతాయి.