PM Modi Tweet On Donald Trump Win: ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు 2024 ఫలితాలు రానే వచ్చేసాయి. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్ని వర్గ రంగాలకు సంబంధించి ప్రముఖులు, వివిధ దేశాది నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారతదేశ ప్రధాని మోడీ కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికనైనా ట్రంప్…
ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. చరిత్రలో గొప్ప పునరాగమనానికి అభినందనలు తెలిపారు.
Olympics: ప్రపంచంలో అత్యున్నత క్రీడావేదిక ‘‘ఒలింపిక్స్’’ని భారత్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని పంపింది. ఒలింపిక్స్‌ని నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2036లో భారత్ ఒలింపిక్స్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాని నరేంద్రమోడీ కలలకు ఇది అద్దంపడుతోంది. ఒక వేళ ఈ అవకాశం లభిస్తే…
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు.
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్‌లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు.
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓవర్‌లోడ్‌తో కూడిన బస్సు లోతైన లోయలో పడడంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు.