Bibek Debroy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రోయ్ (69)ఈ రోజు (శుక్రవారం) కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో దేబ్రోయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
PM Modi: దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన కేవడియాలో ఉంటారు. ఇక్కడ జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.284 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం…
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. దీపావళి రోజున గుజరాత్ ప్రజలకు వేలకోట్ల విలువైన బహుమతులు ఇవ్వనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
PM Modi : ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు.