Rajnath Singh: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
- రష్యాలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
- నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
- ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రష్యాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా అధ్యక్షుడితో భారత రక్షణ మంత్రి ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక, ఆదివారం రాత్రి రష్యా చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ ను రాయబారి వినయ్ కుమార్, రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అలెగ్జాండర్ ఫోమిన్ లు ఘన స్వాగతం పలికారు.
Read Also: Maoists: చింతూరు ఏజెన్సీలో మావోల దుశ్చర్య.. కారును దగ్ధం చేసిన మావోయిస్టులు!
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ఇక, ఈరోజు (డిసెంబర్ 10) రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలోని ‘టోంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్’ వద్ద సోవియట్ సైనికులకు నివాళులర్పించిన తర్వాత భారతీయులను ఉద్దేశించి ప్రసంగించననున్నారు. కాగా, ఇప్పటికే భారత రక్షణ శాఖ మంత్రి ఇరు దేశాల (భారతదేశం- రష్యా) మధ్య రక్షణ సహకారాన్ని మరింత పటిష్టంగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అయితే, సోమవారం నాడు గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తుషీల్ (ఎఫ్ 70)ని రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో భారత నౌకాదళంలోకి రాజ్‌నాథ్ సింగ్ పంపారు. ఈ ఐఎన్‌ఎస్ తుషీల్ ప్రాజెక్ట్ 1135.6 సిరీస్‌లో రష్యా తయారీ చేసిన ఏడవ మల్టీరోల్ స్టెల్త్ ఫ్రిగేట్, ఇది ఆకాశంలో, నీటి అడుగున, విద్యుదయస్కాంత పరిమాణాలలో నావికాదళ యుద్ధం చేసేలా రూపొందిస్తున్నారు.
Read Also: NBK 109 : ‘డాకు మహారాజ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలే.!
కాగా, అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా 22వ భారత్-రష్యా సమ్మిట్‌కు నరేంద్ర మోడీ హాజరయ్యారు. అలాగే, కజాన్‌లో జరిగిన రెండు రోజుల బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!