పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.
C-295 Military Aircraft: ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం సంయుక్తంగా టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ని ప్రారంభించారు. గుజరాత్ వడోదరలోని టాటా ఫెసిటిలీలో 40 సైనిక వ్యూహాత్మక రవాణా విమానాలైన C-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిర్మించనున్నారు. ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. C-295 ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు: C-295 ఎయిర్‌క్రాఫ్ట్ వైమానిక దళానికి ఎంతో కీలకమైనది. ఈ విమానాలకు 5-10 టన్నుల సామర్థ్యం ఉంటుంది. C-295 అనేది 71 మంది…
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్‌క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు.
PM Modi on Ratan Tata: ప్రధాని నరేంద్ర మోడీ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మనతో ఉండి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు. సోమవారం గుజరాత్‌లోని వడోదరలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటాను గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. ఇటీవల మనం దేశం గొప్ప కుమారుడు రతన్ టాటా జీని…
పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ' ఆలోచించండి, చర్య తీసుకోండి' అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు.
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్లో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు..
అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి, భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది.