PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు.
మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభం ఉంటుందని ప్రధాని తెలిపారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘‘మహాయుతి’’ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు గానూ ప్రస్తుతం 220 కిపైగా స్థానాల్లో బీజేపీ+షిండే సేన+అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే సేన, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 54 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నాయి.
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు.
Mahua Moitra: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు మరోసారి అదానీ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది.
గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Adani- Congress: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది.
Canada-India Row: గత కొన్నాళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది.