ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.
Modi-Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఇద్దరు నాయకులు భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి…
Prabowo Subianto : ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత సాయంత్రం ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
Republic Day: భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు.
Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు.
Pushpak Express Incident : మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక విషాద సంఘటన జరిగింది. ముంబై వైపు వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులలో మంటలు చెలరేగాయని తప్పుడు పుకారు వ్యాపించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తర్వాత మొట్టమొదట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసింది.. భారత్ ప్రధాని మోడీనే అని ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ తెలిపారు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
PM Modi: ఢిల్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార ఆప్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌తో ఢిల్లీ పోరు త్రిముఖ పోటీగా మారింది. ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం ఆప్‌ని, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. తాజాగా, ఢిల్లీలోని బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ…