ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. ఫిబ్రవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితాలు వెలువడిన రెండ్రోజులకే ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. విదేశాల నుంచి వచ్చాకే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. తీరా ప్రధాని మోడీ వచ్చి మూడ్రోజులు అవుతున్నా.. సీఎం ఎంపికపై మాత్రం ఊగిసలాట సాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Nainathra: భర్తతో కలిసి రొమాంటిక్ వీడియో షేర్ చేసిన నయనతార..
సోమవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. సోమవారం సాయంత్రంలోపు కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని కూడా చెప్పుకొచ్చారు. మీడియా, ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ అధిష్టానం బాంబ్ పేల్చింది. అనూహ్యంగా శాసససభా పక్ష సమావేశాన్ని వాయిదా వేసింది. వచ్చే గురువారానికి హైకమాండ్ వాయిదా వేసింది. దీంతో మరో మూడు రోజులు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా మహిళల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి దళితులకు సీఎం పీఠాన్ని కట్టబెట్టొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. ఇందుకోసం 15 మంది పేర్లను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ దృష్టిలో ఎవరున్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: WPL 2025: తొలి విజయాన్ని అందుకున్న గుజరాత్ జెయింట్స్