PM Modi: పాకిస్తాన్, దాని ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం బీహార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రపంచానికి తెలిసేలా సందేశం ఇచ్చారు. సభలో ఆయన హిందీలో మాట్లాడుతూ, ఒక్కసారిగా ఇంగ్లీష్‌కి మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా తన వార్నింగ్ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లో హెచ్చరికలు పంపారు.
‘‘బీహార్ నేల నుండి, నేను ప్రపంచానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని మరియు వారి వెనుక ఉన్నవారిని గుర్తించి మరీ శిక్షిస్తాం.’’ అని ఆయన అన్నారు. ఈ దాడి పాకిస్తాన్ ప్రమేయంతో జరిగిందని భారత్ విశ్వసిస్తోంది. ‘‘ మేము ఈ ఉగ్రవాదుల్ని ప్రపంచం చివర వరకు వెంబడిస్తాము. భారతదేశ స్పూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరు. మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరూ మాతో ఉన్నారు’’ అని ప్రధాని అన్నారు.
Read Also: MLC Kavitha: కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. స్కూటీలు, బంగారం ఇస్తామని మోసం చేసారు..!
‘‘చాలా స్పష్టంగా చెప్పాలంటే, ఈ ఉగ్రవాదులు, దాడికి కుట్ర పన్నని వారు ఉహించలేని విధంగా శిక్షస్తాము’’ అని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. అయితే, హిందీలో మాట్లాడుతున్న ప్రధాని, ఈ వార్నింగ్ ఇచ్చే సమయంలో ఇంగ్లీష్‌లో ప్రసంగించారు. ప్రపంచానికి అర్థం అయ్యేలా తాము ఏం చేయబోతున్నామనేది వారికి తెలిసేందుకే, ప్రధాని నేరుగా ఇంగ్లీష్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అమెరికా, రష్యా అధినేతలు ప్రధాని మోడీని ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయిల్ అన్ని దేశాలు పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ సమయంలో భారత్ వెంటే తాము ఉంటామని చెప్పాయి. ఇప్పటికే, పాకిస్తాన్ టార్గెట్‌గా భారత్ దౌత్యపరంగా దాడులు మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దుతో పాటు, బోర్డర్‌ని క్లో జ్ చేసింది. పాక్ రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్యని తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
India will identify, track and punish every terrorist, their handlers and their backers.
We will pursue them to the ends of the earth.
India’s spirit will never be broken by terrorism. pic.twitter.com/sV3zk8gM94
— Narendra Modi (@narendramodi) April 24, 2025