కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు కూడా రాశారు.. మధ్యప్రదేశ్,…
భారత గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. రాజ్ పథ్ పరిసరప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉగ్ర హెచ్చరికలతో భారీగా భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఏర్పాట్లు వున్నాయి. ప్రతి సంవత్సరం లక్షమంది పాల్గొనేవారు. ఈసారి 6 వేలమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతాయని సమాచారం వుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.…
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్…
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు. తెలంగాణలో పొడు…
50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక…
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.…
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను గుర్తుచేసుకున్నారు. దేశం కోసం అనేక మంది మహిళలు త్యాగాలు చేశారని వారి త్యాగం మరువలేనిదని మోడీ కొనియాడారు. “ప్రపంచం ప్రతికూల అంధకారంలో మునిగిపోయినప్పుడు, స్త్రీల గురించి ఆలోచిస్తూ భారతదేశం మాతృమూర్తిని దేవత రూపంలో ఆరాధించేది. సమాజానికి విజ్ఞానాన్ని అందించే గార్గి, మైత్రేయి, అనుసూయ, అరుంధతి మరియు మదాల్సా వంటి పండితులు మనకు ఉన్నారు” అని ఈరోజు…