తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు.
PM Modi Tour : ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అతనికి 6 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ఈ క్రమంలో ఆయన ముందుగా జపాన్ చేరుకున్నాడు. అక్కడ ఆయన G-7 సమావేశాల్లో పాల్గొన్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వి.జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Mallikarjun Kharge : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయడంపై విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.... ప్రధాని నరేంద్ర మోడీ చర్యలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ జపాన్కు వెళ్లినప్పుడల్లా ‘నోట్ బందీ’ నోటిఫికేషన్ వస్తుందని ఖర్గే ఎద్దేవా చేశారు.
PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.
MK Stalin: రూ. 2000 నోట్లను రద్దు చేస్తూ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది తుగ్లక్ నిర్ణయమని, మరో విపత్తుకు నాంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అర్వింద్ కేజ్రీవాల్, మల్లికార్జున ఖర్గే వంటి వారు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి.
Kejriwal : రిజర్వు బ్యాంక్ ఇండియా నిన్న(శుక్రవారం) పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి జనాలకు ఝలక్ ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని నడిరోడ్డుపై నిలబెట్టేశారు. ఏటిఎంలలో నొట్లను మార్చుకునేందుక ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
RBI Guidelines: 2000 రూపాయల నోటును చెలామణి చేయకుండా నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు బ్యాంకులు, దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకునేందుకు అనుమతించారు.