New Parliament Building: టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దేశంలో ఇంతకుముందు బడ్జెట్ కాగితంపై రూపొందించేవారు, కానీ మోడీ ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద మార్పులు సంభవించాయి. బడ్జెట్ రూపకల్పన పేపర్‌లెస్‌గా మారింది.
NATO : గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య స్నేహం చాలా బలంగా మారింది. దీని ఫలితం వ్యాపారం రంగంలో కూడా కనిపించింది. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. ఈ ఎపిసోడ్లో, నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చాలని అమెరికాలో సిఫార్సు చేయబడింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
PM Modi: 1947లో పాకిస్థాన్ మతం పేరుతో ప్రత్యేక దేశంగా అవతరించింది. భారత్‌ను శత్రువుగా అంగీకరించింది. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేసినా అలాంటి మంచి అవకాశం రాలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు పాక్ ప్రధాని జనరల్ పర్వేజ్ ముషారఫ్‌తో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రయత్నించారు.
9 Years Of Narendra Modi Government: మే 26తో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. 2014లో బీజేపీ తొలిసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.
Congress: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 30తో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ‘9 ఏళ్లు, 9 ప్రశ్నలు’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. బీజేపీ హాయాంలో జరిగిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
PM Modi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం గురించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం.
Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని ప్రారంభం చేయడాన్ని తప్పుబడుతూ.. న్యాయవాది జయ సుకిన్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని కాదని ప్రధాని కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
Deve Gowda: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయమా.?? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని, ఇది దేశ ప్రజల ఆస్తి, ఇది వ్యక్తిగత విషయం కాదని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాక్యలు చేశారు.