PM Modi: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం అసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ శనివారం వీడియో మెసేజ్ ద్వారా ప్రసంగించారు.
Read also:Viral Video : ఓరి నాయనో.. ఈ బుడ్డోళ్ల కష్టాలు పగోడికి కూడా రాకూడదు..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
భారత దేశంలో 85 కోట్ల మంది మొబైల్ డేటాను ఉపయోగించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే తక్కువ ధరలకు డేటాను అందిస్తున్న దేశం ఇండియానేనని అన్నారు. భారత దేశంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విస్తృతి, వేగం, పరిధులను ప్రధాని వివరించారు. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకం మూలంగా గత తొమ్మిదేళ్లలో భారత దేశంలో డిజిటల్ పరివర్తన జరిగిందని స్పష్టం చేశారు. పరిపాలన తీరును మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ వల్ల వ్యవస్థలో లోపాలను అరికట్టగలుగుతున్నామని ప్రధాని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదును (డీబీటీ) అందజేయగలుగుతున్నట్లు తెలిపారు. పన్నుల వ్యవస్థను పూర్తిగా డిజిటైజ్ చేయడం వల్ల పారదర్శకత వృద్ధి చెందుతోందని, ఈ-గవర్నెన్స్ జరుగుతోందని తెలిపారు. వర్కింగ్ గ్రూప్ రూపొందిస్తున్న జీ20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ పట్ల ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కామన్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన పురోగతిలో ఉందని మోడీ చెప్పారు. అందరికీ న్యాయమైన, పారదర్శకత కలిగిన, జవాబుదారీతనంతో కూడిన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటిందని.. ఈ ఖాతాల్లో 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిందని గుర్తు చేశారు. పెద్దమొత్తంలో జన్‌ధన్ ఖాతాలు తెరవడం పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఖాతాల్లో సగం ఖాతాలు నారీ శక్తికి సంబంధించినవని ప్రధాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!