Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama: భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. చంద్రయాన్-3 విజయవంతమైనందుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి శాస్త్రీయ అభివృద్ధికి కృషి చేసిన భారత శాస్త్రజ్ఞులకు ఆయన అభినందనలు తెలిపారు.
Read Also: ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్, ఏజెన్సీలోని శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ప్రశంసించారు, భారతదేశం శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించే లక్ష్యంతో ఈ మిషన్‌లో పనిచేశారని కొనియాడారు. “మిషన్‌ను సాధ్యం చేసిన వారి అంకితభావానికి ఇస్రో అధిపతి, అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వారు భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక పరిపక్వతను ప్రదర్శించారు” అని ఆధ్యాత్మిక నాయకుడు చెప్పినట్లు ప్రకటన పేర్కొంది. “భారతదేశంలో ఎక్కువ కాలం గడిపిన అతిథిగా, ఈ గొప్ప విజయానికి నేను సంతోషిస్తున్నాను. భారత వైజ్ఞానిక పరిశోధనా సంస్థ తదుపరి శాస్త్రీయ ప్రయత్నాలలో తన నాయకత్వ పాత్రను బలోపేతం చేయడానికి కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని దలైలామా అన్నారు. ప్రార్థనలు, శుభాకాంక్షలతో ఆయన తన సందేశాన్ని ముగించారు.
Read Also: Viral Video: మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్ యువకుడి ఫన్నీ కామెంట్
అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది. అలా చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. యూఎస్, రష్యా, చైనా తర్వాత చంద్రుని ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ వ్యోమనౌకను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!