MP Kesineni Nani: చంద్రబాబు అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన సాగుతుండగా.. ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు విడివిడిగా లేఖలు రాశారు ఎంపీ కేశినేని నాని..
Read Also: Health Tips: గ్రీన్ టీలో వీటిని కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాంటూ విడివిడిగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు కేశినేని నాని.. చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు.. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఏపీ పోలీసులపై నమ్మకం పోయింది. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తన లేఖల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మరోవైపు.. చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడిన విషయం విదితమే.. ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేసిన విషయం విదితమే.







తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!