జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు.
TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు.
PM Modi: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తొలిసారిగా బహిరంగంగా ప్రధాని మోడీ స్పందించారు. మధ్యప్రదేశ్ లో బీనాలో ఆయన పలు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసేందుకు వచ్చారు.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని