ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి నూతన భవనంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగిస్తూ జీ20 సదస్సుపై ప్రధాని మోడీ చర్చించారు.
PM Modi Speech On Parliament Old Building: ‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా…
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
PM Vishwakarma scheme: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన పుట్టిన రోజు కానునగా హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు.
Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆవిష్కరించారు.
విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజులో 73వ ఏట అడుగుపెట్టారు.రాష్ట్రపతితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. దేశ నాయకుల
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు.
Producer KS Ramarao‘s letter to Prime Minister Narendra Modi about Chandrababu: టాలీవుడ్ సీనియర్ సినీ నిర్మాత కె.ఎస్ రామారావు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పై సీమాంధ్రులకు ఎలాంటి అభిప్రాయం ఉందో, అందుకు సహకరించిన మీ పార్టీపైనా అదే అభిప్రాయం ఉంది కానీ 2014 ఎన్నికల్లో మీరు కొన్ని సీట్లు, ఓట్లు సంపాదించగలిగారంటే అందుకు కారణం ఒకే ఒక వ్యక్తి…